ఈ ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టారా!

 ఈ ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టారా! ఒక్క పాటతో పాన్ ఇండియాని ఊపేసింది..



ఫేవరేట్ హీరోయిన్స్ ఏ గెటప్ లో కనిపించినా అభిమానులకు ఇట్టే నచ్చేస్తుంటారు. అందుకు కారణం.. హీరోయిన్స్ అందం, డ్రెస్సింగ్ స్టైల్ కాదు.. వారి క్యూట్ నెస్. అలాంటి లక్ అందరికీ రాదు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. తెరపై సినిమాల ద్వారా మన ముందుకు వస్తుంటారు. వారిని చూసి ఆరాధించడం అంటే.. మాటలు కాదు. వాళ్ళు గ్లామర్ షో చేయక్కర్లేదు. తెరపై కనిపిస్తే చాలనే ఫీలింగ్ కలిగిస్తుంటారు.ఎప్పుడైనా సరే ఫేవరేట్ హీరోయిన్స్ ఏ గెటప్ లో కనిపించినా అభిమానులకు ఇట్టే నచ్చేస్తుంటారు. అందుకు కారణం.. హీరోయిన్స్ అందం, డ్రెస్సింగ్ స్టైల్ కాదు.. వారి క్యూట్ నెస్. అవును.. అందంగా ఉండగానే హీరోయిన్స్ నచ్చేయరు. అంతకుమించి వ్యక్తిగతంగా మంచితనం ఉంటే ఫ్యాన్స్ కాస్త ఫ్యామిలీలా భావించేస్తుంటారు. అలాంటి లక్ అందరికీ రాదు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. తెరపై సినిమాల ద్వారా మన ముందుకు వస్తుంటారు. వారిని చూసి ఆరాధించడం అంటే.. మాటలు కాదు. టాలీవుడ్ లో డెబ్యూ మూవీతో అందరి మనసులు దోచుకున్న హీరోయిన్స్ అరుదుగా కనిపిస్తుంటారు.


వాళ్ళు గ్లామర్ షో చేయక్కర్లేదు. తెరపై కనిపిస్తే చాలనే ఫీలింగ్ కలిగిస్తుంటారు. అలా మొదటి సినిమాతోనే రెండు తెలుగు రాష్ట్రాలలోని యూత్ హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ సమంత. ‘ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకు ఏమవ్వలే.. ఓ నిన్నగాక మొన్న వచ్చి ఏ మాయచేశావే..’ అంటూ సాంగ్ లో రెహమాన్ చెప్పినట్లుగానే యూత్ లైఫ్ లో జరిగిపోయింది. అంతే.. ఏ మాయ చేశావేలో జెస్సి నుండి మొన్నటి రామలక్ష్మి, నిన్నటి యశోద పాత్రల వరకు సమంతను అభిమానించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప, ఎప్పుడు తగ్గలేదు. సమంత ఎలాంటి క్యారెక్టర్ చేసినా ఫ్యాన్స్ ఆదరిస్తూ సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు.




ప్రస్తుతం సామ్.. ‘శాకుంతలం’ సినిమాతో మరోసారి ఫ్యాన్స్ ని మెప్పించేందుకు రెడీ అవుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో.. వివిధ భాషలలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి. సమంత కూడా మొన్నటిదాకా మైయోసైటిస్ కి చికిత్స తీసుకొని.. ఇటీవల షూటింగ్స్ లో మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో సమంతకి సంబంధించి చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తారసపడింది. ఎంతో క్యూట్ గా, పాలబుగ్గలతో.. పెద్ద బొట్టు పెట్టుకొని.. మల్లెపూల పక్కనే ఉండి కెమెరా వైపు లుక్కిచ్చింది. ఇంకేముంది పిక్ లో సామ్ ని చూసి ఫ్యాన్స్ ఫిదా. ముందు ఆ ఫోటోలో ఉంది సమంత అని తెలియడానికి టైమ్ పట్టవచ్చు. కానీ.. పేరు తెలిశాక ఆశ్చర్యపోవడం మామూలే. సో.. ప్రెజెంట్ సామ్ చిన్ననాటి పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి సమంత చైల్డ్ హుడ్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Comments