Posts

Showing posts from September, 2022

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా సాంగ్ లిరిక్స్

Image
పల్లవి  మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.. అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంటా బయట... అలుపని రవ్వంత అననే అనవంట... వెలుగులు పూస్తావు వెళ్లే దారంత... స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.గ.స... మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.. చరణం నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా... నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా... ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమా అంచనాలకందునా... ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా... నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా... ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా... స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ.స... మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా... మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా... ‘వకీల్ సాబ్’ ఫస్ట్ సాంగ్: మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ..

Srivalli Song Lyrics శ్రీవల్లి సాంగ్ లిరిక్స్ తెలుగు

Image
నిను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిపేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవున్ని కన్నార్పక చూస్తావే  కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయెనే శ్రీవల్లి  మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయెనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే అన్నిటికి ఎపుడు ముందుండే నేను  నీ ఎనకే ఇపుడు పడుతూ వున్నాను ఎవ్వరికి ఎపుడు తలవంచని నేను  నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను ఇంత బ్రతుకు బ్రతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే  ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయెనే శ్రీవల్లి  మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయెనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే నీ స్నేహితురాలు ఓ మోస్తారు ఉంటారు అందుకనే ఏమో నువ్ అందంగుంటావు పదేనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు  నువ్వే కాదు ఎవరైనా ముద్దుగా ఉంటారు ఎర్ర చందం చీర కడితే రాయి కూడా రా కుమారే ఏడురాళ్ల దుద్దులు పెడితే ఎవతైన అందగతే అయిన చూపే బంగారమాయెనే శ్రీవల్లి  మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయెనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే సాంగ్:- శ్రీవల్లి  లిరిక్స్:- చంద్రబోస్ మ్యూజిక్ డైరెక్టర్ :- దేవి శ్రీ ప్రసాద్  సినిమా :- పుష్ప